గ్లోబల్ సౌత్ ‘రూలింగ్’ చేయాలి
- ఒక భాగస్వామ్య వేదిక పుట్టాలి
- 20 ఏళ్లపాటు బ్రిక్స్‌కు ‘నూతన, ప్రతిష్టాత్మక అజెండా’ ఉండాలి
- ప్రపంచ పాలన సంస్కరణలకు 10-సూత్రాల రోడ్‌మ్యాప్
- 18వ బ్రిక్స్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ
న్యూ ఢిల్లీ, సెప్టెంబర్ 12: వాణిజ్య ఘర్షణలు(Trade conflicts), భౌగోళిక రాజకీయ (Geopolitical)అస్థిరతలు పెరు గుతున్న ఆర్థిక ప్రతికూలతలకు కారణ మవుతున్న నేపథ్యంలో బ్రిక్స్ సారథ్యంలో (BRICS Leadership) భాగ స్వామ్య వేదిక పుట్టాలని, గ్లోబల్ సౌత్ ‘రూలింగ్’గా అవతరించా లని ప్రధాని నరేం ద్ర మోదీ అన్నారు. విశేషాధికారాల పిరమిడ్ స్థానంలో ‘భాగస్వామ్య వేదిక’ను ఏర్పాటు చేయాలని బ్రిక్స్‌లో మోదీ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలోని భారత మండపంలో 18వ బ్రిక్స్ సదస్సును శనివారం ప్రధాని మోదీ ప్రారంభించి మాట్లాడారు.
ప్రస్తుతం కొనసాగుతున్న ప్రపంచ, ప్రాంతీయ సంక్షోభాల వ ల్ల తీవ్రమైన ప్రమాదాలను ఎదుర్కొంటున్న నావికులను కాపాడటానికి ‘నావికుల అత్యవసర సహాయక నెట్‌వర్క్’ ఏర్పాటు చేయా లని సూచించారు. బ్రిక్స్ చట్రం కింద ప్రపం చ పాలన సంస్కరణల కోసం 10-సూత్రాల రోడ్‌మ్యాప్‌ను కూడా ప్రధాని ఆవిష్కరిం చారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌లతో సహా ప లువురు ప్రపంచ నాయకుల సమక్షంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. తన ప్రసంగం లో ఒక కీలకమైన ప్రపంచ కూటమిగా ఆవిర్భవించినందుకు బ్రిక్స్‌ను మోదీ ప్రశంసిం చారు. తీవ్రమైన ప్రపంచ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి వీలుగా, రాబో యే 20 ఏళ్లపాటు ఈ కూట మికి ఒక ‘నూతన, ప్రతిష్టాత్మక అజెండా’ ఉండాలని ఆయ న పిలుపునిచ్చారు.
బ్రిక్స్ అధ్యక్ష హోదాలో, ఉక్రెయిన్ పశ్చిమ ఆసియాలోని సంఘర్షణల ఆర్థిక పరిణామాల నుంచి అభివృద్ధి చెందుతున్న దేశాలను వేరుచేయడానికి, ఆహారం, ఇంధనం, సరఫరా గొలుసు భద్ర త కోసం ఆచరణయోగ్యమైన పరిష్కారాల ను అన్వేషించడం ద్వారా భారతదేశం ‘గ్లోబల్ సౌత్’కు తన అజెండాలో కేంద్ర స్థానం కల్పించింది. ‘ప్రపంచ పాలన ప్రస్తుత నిర్మాణం ఒక పిరమిడ్‌ను పోలి ఉంది.
అధికారం, నిర్ణయాధికారం పైభాగంలో కేంద్రీ కృతమై ఉండగా, దిగువ శ్రేణులలోని దేశా లు ఈ నిర్ణయాల వల్ల ప్రభావితమవుతా యి. కానీ వాటిని రూపొందించలేవు’ అని మోదీ స్పష్టం చేశారు. ‘నేడు, ప్రపంచ సంక్షోభాల విషయంలో గ్లోబల్ సౌత్ ముందు వరుసలో నిలుస్తున్నప్పటికీ, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో మాత్రం వెనుకబడి ఉంది.
మనం ఈ ‘విశేషాధికారాల పిరమిడ్’ ను ‘భాగస్వామ్య వేదిక’గా మార్చాలి. అక్కడ ప్రతి దేశానికీ ఒక గొంతుక ఉండాలి. ప్రతి స భ్య దేశానికి ఒక వాటా ఉండాలి. చేసే ప్రతి ప్రయత్నానికి మానవాళి అభివృద్ధి కేంద్రం గా ఉండాలి’ అని ప్రధాని తేల్చిచెప్పారు.
రోడ్‌మ్యాప్‌ను రూపొందించాలి
ఈ దిశగా, బ్రిక్స్ కూటమి సంస్కరణల రోడ్‌మ్యాప్ విస్తృత చట్రంలో భాగంగా, ప్రపంచ పాలన సంస్కరణల కోసం 10-సూత్రాల రోడ్‌మ్యాప్‌ను సంయుక్తంగా రూపొం దించాలని ప్రధానమంత్రి మోదీ ప్రతిపాదించారు. తదుపరి శిఖరాగ్ర సమావేశం నాటికి ఈ రోడ్‌మ్యాప్ ఖరా రు చేయాలని స్పష్టం చేశారు. ఈ రోడ్‌మ్యాప్‌ను రూపొందించడంలో, మనం మూడు కీలక అంశాలపై దృ ష్టి పెట్టాలన్నారు. ప్రాతినిథ్యం, స్పందన, ని యమ నిబంధనల రూపకల్పన కీలకంగా ఉండాలన్నారు.
‘ప్రాతినిథ్యం‘ గురించి వివరిస్తూ, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంస్కరణలను ఇకపై వాయిదా వేయలేమని, దానిపై చర్చలను ఒక నిర్దిష్ట కాలపరి మితికి, స్పష్టమైన ఫలితాల పరిధిలోకి తీసుకురావాలని కోరారు. అదేవిధంగా, ఆర్థిక సంస్థలలోని ఓటింగ్ అధికారం, నాయకత్వ స్థానాలు, విధాన ప్రాధాన్యతలు నేటి ఆర్థిక వాస్తవాలకు అనుగు ణంగా ఉండాలని స్ప ష్టం చేశారు. ప్రపంచ ఆర్థిక వృద్ధిని నడిపిం చే దేశాలు, ప్రపంచ ఆర్థిక పాలనను తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించాలన్నారు.
నియమాలను బ్రిక్స్ తీర్చిదిద్దాలి
తన మూడో అంశాన్ని వివరిస్తూ, భవిష్యత్ ప్రపంచ నియమాలను నిర్వచించడం లో సమాన భాగస్వామ్యాన్ని నిర్ధారించడం చాలా కీలకమని ప్రధాని పునరుద్ఘాటించారు. ‘మనం గ్లోబల్ సౌత్‌ను ‘నియమాల ను పాటించే దేశం’ నుంచి ‘నియమాలను తీర్చిదిద్దే దేశం’గా మార్చడానికి కృషి చేయాలన్నారు. ప్రపంచ వాణిజ్య ప్రవాహంలో సముద్రయాన కార్మికుల సంఘం పోషిస్తు న్న కీలక పాత్రను కూడా ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు.
వారి భద్రతకు ప్రా ధాన్యత ఇవ్వాలని కోరారు. ‘ప్రపంచ వాణిజ్యానికి సముద్రయాన కార్మికులు భారీగా దోహదపడతారు, అయినప్పటికీ కష్ట సమయాల్లో వారికి తరచుగా మద్దతు కొరవడు తుంది. మనం ’సముద్రయాన కార్మికుల అత్యవసర సహాయక నెట్వర్క్’ను ఏర్పాటు చేయాలని నేను ప్రతిపాదిస్తున్నా, అన్నారు.
ప్రపంచ పాలనా నిర్మాణంలో సంస్కరణలు తీసుకురావాలని, అలాగే బ్రిక్స్‌ను మరింత బలోపేతం చేసే మార్గాలను అన్వేషించాలని మోదీ పిలుపునిచ్చారు. ఈ ఏడాది బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం చారిత్రాత్మక మైలురాయ ని, మనం బ్రిక్స్ 20వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. మా నవ జీవితంలో ఈ 20 ఏళ్ల బ్రిక్స్ పరిపక్వత, బాధ్యతతో కూడిన కొత్త దశకు నాంది అని తెలిపారు.