ఈ వారం వార్తల్లో..

13-09-2026 | 05:25am

హరీశ్‌రావత్‌పై పీఏ ఎఫెక్ట్!

ఉత్తరాఖండ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత హరీశ్ రావత్.. (Senior Congress leader Harish Rawat) ఉత్తరాఖండ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యవర్గం, సీడబ్ల్యూసీ శాశ్వత ఆహ్వానితుడి పదవుల నుంచి వైదొలిగారు. దెహ్రాదూన్‌లోని రావత్ పీఏ చందన్ సింగ్ జీనా ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించగా నగదు, బంగారం పట్టుబడింది. ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల జరుగుతున్నందున తన వల్ల పార్టీకి ఇబ్బంది కలగకూడదనే రాజీనామా నిర్ణయం తీసుకున్నారు.

ఏడేళ్ల తర్వాత జిన్‌పింగ్ రాక

బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు ఏడేళ్ల తర్వాత భారత్‌కు వచ్చారు. 2019లో చెన్నైలో జరిగిన అనధికారిక సదస్సుకు జిన్‌పింగ్ వచ్చారు. 2020లో తూర్పు లడఖ్‌లోని గల్వాన్ లోయలో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణల తర్వాత భారత్ సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో మోదీ భేటీలో ఇరు దేశాల సంబంధాలు పురోగతి సాధించనున్నాయి. 

మరిన్ని వార్తలు