హనీట్రాప్.. బాలికల కుటుంబాలకు బెదిరింపులు
లొంగిన ఓ బాలిక కుటుంబం.
కేసు నుండి ప్రధాన సూత్రధారిని తప్పించినట్లు ప్రచారం
కలకలం రేపుతుతున్న కేరళ ఫైల్స్ తరహా ఘటన
బిజినేపల్లి: నాగర్ కర్నూల్ జిల్లా, బిజినేపల్లి మండలంలో కేరళ ఫైల్స్(The Kerala Files) తరహా ఘటనలో భయానక ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. గురువారం రాత్రి బిజినేపల్లి పోలీస్ స్టేషనులో(Bijinapally Police Station) సోహైల్, సమీర్ ఇద్దరు యువకులతో పాటు మెహారున్ అనే మహిళపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో ప్రధాన సూత్రదారి ఒక యువకుడిపై పిర్యాదు కాకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఒక వర్గం ముగ్గురు మైనర్ బాలికలపై మరో వర్గం ముగ్గురు యువకులు అఘాయిత్యానికి పాల్పడ్డారని స్థానికులంతా చర్చించుకుంటుండగా ప్రధాన సూత్రదారి పేరు ఫిర్యాదులో మాయం కావడం చర్చకు దారితీస్తోంది.
అందుకు సదరు మైనర్ బాలిక కుటుంబంపై రాజకీయ ఒత్తిళ్లు, బెదిరింపులు కారణంగా తెలుస్తోంది. కాగా గురువారం రాత్రి ఓ బాలిక కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషనులో పిర్యాదు చేయకుండా ఉండేందుకు కొందరు వ్యక్తులు ప్రత్యేక గస్తీ నిర్వహించారని పలువురు అంటున్నారు. ఇదిలా ఉంటే ఒక బాలిక కుటుంబం ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. ఆ కుటుంబానికి పలువురు వ్యక్తుల నుండి రాజకీయ ఒత్తిళ్లు, బెదిరింపులు రావడం వలననే బయటికి రాకపోవచ్చని పలువురు అనుమానిస్తున్నారు.
పోలీసుల చర్యలతో అవమానంగా భావిస్తున్న కుటుంబాలు.
అఘాయిత్యానికి గురైన బాలికలను, కుటుంబ సభ్యులను అధికారులు విచారణ పేరుతో తమ కార్యాలయాల చుట్టూ తిప్పుకోవడంతో వారు అవమానంగా భావిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ప్రధాన సూత్రదారి యువకుడి పేరు కనిపించక పోగా, పిర్యాదు చేసిన మరో బాలిక కుటుంబం సరైన న్యాయం జరుగుతుందో లేదో, లేక తమను భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులకు గురి చేస్తారా అనే భయాందోళనలో ఉన్నారు.