ఖైరతాబాద్‌లో ఈనెల 14 నుంచి ట్రాఫిక్ ఆంక్షలు

12-09-2026 | 05:23pm

హైదరాబాద్, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి):  ఖైరతాబాద్(Khairatabad) బడా గణేష్‌ దర్శనానికి భారీగా భక్తులు తరలిరానున్న నేపథ్యంలో ఈనెల 14 నుంచి 23 వరకు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. సుమారు 30లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులు మెట్రో, ఎంఎంటీఎస్‌, ఆర్టీసీ బస్సులను వినియోగించాలని ట్రాఫిక్ జాయింట్‌ సీపీ జోయల్ డెవిస్ సూచించారు. ఐమ్యాక్స్‌, హెచ్‌ఎండీఏ స్థలం, ఎన్టీఆర్‌ పార్క్‌, నెక్లెస్‌ రోడ్‌లో పార్కింగ్‌ సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. వీఐపీల కోసం ప్రత్యేక రూట్‌ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

మరిన్ని వార్తలు