తెలంగాణ భవన్‌లో మాక్ అసెంబ్లీ
12-09-2026 | 11:45am
హైదరాబాద్, సెప్టెంబర్ 12(విజయక్రాంతి): బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌కు నిరసనగా తెలంగాణ భవన్‌లో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. మాక్ అసెంబ్లీలో సీఎంగా తలసాని శ్రీనివాస్ యాదవ్, స్పీకర్‌గా జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు వ్యవహరిస్తున్నారు. మంత్రులుగా గంగుల కమలాకర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.
అసెంబ్లీ తరహాలో మాక్ అసెంబ్లీని నిర్వహించి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌తో పాటు ప్రభుత్వ తీరుపై నేతలు చర్చిస్తున్నారు. ఈ సందర్భంగా సభలో పలు ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి.