భారత్ మండపంలో 18వ బ్రిక్స్ సదస్సు ప్రారంభం
న్యూఢిల్లీ: భారత్ బ్రిక్స్(BRICS Summit) సదస్సుకు ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధమైంది. ఢిల్లీలోని భారత్ మండపంలో(Bharat Mandapam) 18వ బ్రిక్స్ సదస్సు ఘనంగా ప్రారంభమైంది. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమ్మిట్ కు భారత్ బ్రిక్స్ అధ్యక్ష స్థానంలో ఉన్నది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi), చైనా అధినేత జిన్ పింగ్, రాష్యా అధ్యక్షుడు పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు రామఫోసా, ఐరాస సెక్రటరీ జనరల్ గుటెరస్ తో పాటు పలువురు ప్రముఖులు నేతలు హాజరుకాన్నారు. ఆహార భద్రత, ఇంధన స్థిరత్వం, సప్లై చైన్ సమస్యల, భౌగోళిక ఉద్రిక్తతలు(Geopolitical tensions) దేశాలకు శరాఘాతం కాకుండా నిలువరించడంపై చర్చించనున్నారు.
మధ్యాహ్నం 'సమ్మిళిత ప్రపంచ పాలన- బహుపాక్షికత బలోపేతం' అంశంపై భేటీ కానున్నారు. క్లోజ్డ్- డోర్ సమావేశంలో(Closed-door meeting) బ్రిక్స్ సభ్యదేశాల నేతలు పాల్గొనున్నారు. బ్రిక్స్ దేశాల నేతలు సాయంత్రం 'భారత్ ఇన్నొవేట్స్ ఎగ్జిబిషన్'ను(Bharat Innovates Exhibition) సందర్శించనున్నారు. అనంతరం అధికారిక ఫ్యామిలీ ఫొటోగ్రాఫ్, మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనున్నారు. రాత్రి 7.30 గంటలకు సదస్సుకు హాజరైన నేతలకు ప్రధాని మోదీ ప్రత్యేక విందు ఇవ్వనున్నారు.