పురుషులకు ఫ్రీ బస్.. దసరాకేనా?

04-10-2026 | 09:59am

తెలంగాణలో సీనియర్ సిటిజన్లకు (Senior Citizens) కూడా ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే అంశం తెరపైకి వచ్చింది. ప్రస్తుతం మహిళలకు మహాలక్ష్మి పథకం (Mahalakshmi Scheme) ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలవుతుండగా.. ఇదే తరహాలో వృద్ధులకు కూడా ఫ్రీ బస్ పాస్‌లు (Free Bus Passes) అందించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సీనియర్ సిటిజన్లకు ఉచిత బస్ పాసులు అందించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించినట్లు తాజా నివేదికలు చెబుతున్నాయి. అయితే దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. అర్హతలు, వయసు పరిమితి, పాస్‌ల నిబంధనలు వంటి అంశాలపై ప్రభుత్వం చర్చించాల్సి ఉంది.

60 ఏళ్లు దాటిన వారికి అవకాశం?

సీనియర్ సిటిజన్లకు ఈ పథకం అమల్లోకి వస్తే 60 ఏళ్లు పైబడిన మహిళలు, పురుషులు (Men & Women) ఇద్దరికీ ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. అయితే ఏ వయసు నుంచి అర్హత కల్పిస్తారు? ఎలాంటి బస్సుల్లో ఈ సౌకర్యం వర్తిస్తుంది? అనే విషయాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే సీనియర్ సిటిజన్ల సంక్షేమంపై ప్రభుత్వం దృష్టి పెడుతోంది. ఇటీవల నిర్వహించిన వయోవృద్ధుల దినోత్సవ కార్యక్రమాల్లో కూడా సీనియర్ సిటిజన్ సంఘాలు ఉచిత బస్సు ప్రయాణం (Free Travel)తో పాటు ప్రత్యేక సంక్షేమ సంస్థ, ఆరోగ్య సదుపాయాలు, సామాజిక భద్రత వంటి అంశాలను కోరాయి.

ఆర్టీసీపై ఆర్థిక భారం పెరుగుతుందా?

మహిళలకు ఇప్పటికే అమలవుతున్న ఉచిత ప్రయాణ పథకానికి ప్రభుత్వం ఆర్టీసీకి రీయింబర్స్‌మెంట్ (Reimbursement) అందిస్తోంది. సీనియర్ సిటిజన్లకు కూడా ఉచిత ప్రయాణం అమల్లోకి వస్తే టీజీఎస్‌ఆర్టీసీ (TGSRTC), ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ప్రభుత్వం దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్న దశలోనే ఉంది.

త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం

సీనియర్ సిటిజన్లకు ఫ్రీ బస్ సౌకర్యంపై ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో.. విధివిధానాలు (Guidelines) ఖరారైన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఈ ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోదం తెలిపితే.. మహిళల తర్వాత ఉచిత బస్సు ప్రయాణం అందుకునే మరో కీలక వర్గంగా సీనియర్ సిటిజన్లు నిలవనున్నారు.

మరిన్ని వార్తలు