నసర్లబాదు పెద్ద చెరువును కాపాడాలి

03-10-2026 | 11:21pm

జడ్చర్ల: నసర్లబాదు పెద్ద చెరువును(Nasarlabad Lake) కాపాడేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర మత్స్య పారిశ్రామిక సహకార సంఘం(Telangana State Fisheries Cooperative Society) జిల్లా అధ్యక్షుడు గొనెల శ్రీనివాసు(Gonela Srinivasu) కోరారు. జడ్చర్ల పట్టణంలోని మురుగు, కలుషిత నీటిని చెరువులోకి మళ్లించడం వల్ల చేపలు చనిపోయి మత్స్యకారులు, పంట పొలాలకు(Crop fields) నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. సుమారు 450 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పెద్ద చెరువు కట్టకు పటిష్టమైన భద్రత కల్పించి, కట్ట దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. చెరువులో కలుషిత నీరు చేరకుండా అడ్డుకోవడంతో పాటు నాలుగైదు గ్రామాలకు చెందిన రైతులు, మత్స్యకారుల ప్రయోజనాలను కాపాడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

మరిన్ని వార్తలు