తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బీజేపీ ఆధ్వర్యంలో వేడుకలు

17-09-2026 | 04:07pm

బోధన్,(విజయక్రాంతి): తెలంగాణ విమోచన దినోత్సవం(Telangana liberation day ) సందర్భంగా బీజేపీ బోధన్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో గురువారం పలు కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణ అధ్యక్షులు పసుపులేటి గోపి కిషన్ ఆధ్వర్యంలో స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం(Telangana Thalli Statue) వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు.

అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని శక్కర్‌నగర్ రామాలయంలో ప్రత్యేక అర్చన, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీకి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని, దేశ ప్రజల తరఫున భగవంతుని ఆశీస్సులు ఉండాలని నాయకులు ప్రార్థించారు. దేశ అభివృద్ధి కోసం ప్రధాని చేస్తున్న కృషికి ప్రజల మద్దతు కొనసాగాలని వారు ఆకాంక్షించారు. 

ఈ కార్యక్రమంలో బీజేపీ బోధన్ మాజీ పట్టణ అధ్యక్షులు కొలిపాక బాలరాజు, సీనియర్ నాయకులు గొడుగు ధర్మపురి, హన్మండ్లు చారి, గుంత గంగాధర్, పట్టణ ప్రధాన కార్యదర్శి మీర్జాపూర్ అరవింద్, నాయకులు కందికట్ల శ్రీనివాస్, పెరక వెంకటేష్, కార్యదర్శి దేవకాటే శివరాజ్, బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు ఏనుగంటి గౌతమ్ గౌడ్, దళిత మోర్చా అధ్యక్షుడు కలిగోట కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అలాగే స్వప్నిల్, చరణ్, దుర్గా ప్రసాద్, గడ్డం శ్రీనివాస్, లింగు వినోద్, రాములు, కిరణ్, రాజు, నర్సింహులు, శ్రీను, శ్రీకాంత్, కల్యాణ్ తదితర బీజేపీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు