తెలంగాణ విమోచన దినోత్సవం అధికారంగా జరపాలి

17-09-2026 | 03:46pm

బిజెపి మండల అధ్యక్షుడు వేణు 

రుద్రంగి సెప్టెంబర్ 17(విజయక్రాంతి): సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచనా దినోత్సవం(Telangana Liberation Day) సందర్భంగా రుద్రంగి బిజెపి పార్టీ మండల అధ్యక్షుడు కర్ణావత్తుల వేణు జాతీయ జెండా ఆవిష్కరించి మాట్లాడుతు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవన్నీ అధికారికంగా ప్రభుత్వ కార్యాలయాల్లో జరుపుతామని చెప్పి ఇప్పుడు మాటతప్పడం సరికాదని అన్నారు.

ఎమ్ఐఎం(MIM) పార్టీకి భయపడి కాంగ్రెస్ ప్రభుత్వం విమోచన దినోత్సవన్నీ ప్రజాపాలన దినోత్సవంగా జరుపుతోందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం జరిపేది ప్రజాపలన దినోత్సవం కాదని ప్రజా వ్యతిరేక దినోత్సవం అని ఎద్దేవా చేశారు. అనంతరం విశ్వగురువు దేశ ప్రధాని నరేంద్రమోడీ పుట్టినరోజు సందర్భంగా ఆయన పేరుపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పండ్లు పంపిణీ చేశారు.నరేంద్ర మోడీ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో,బిజెపి నాయకులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు