పప్పు ధాన్యాలు, నూనె గింజల పంటలు సాగు
తాడ్వాయి,(విజయక్రాంతి): వచ్చే యాసంగి సీజన్(Yasangi season)లో రైతులు వరి పంట సాగుకు వెళ్లకుండా పప్పు ధాన్యాలు,నూనె గింజల పంటలను సాగు చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) రైతులకు సూచించారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని రైతు వేదికలో శనివారం నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ రైతులకు సూచనలు సలహాలు అందించారు. పంటల మార్పిడి(Crop rotation)తో భూసారాన్ని పరిరక్షించుకోవచ్చని తెలిపారు.
పంటల మార్పిడితో నీటి వినియోగం సక్రమంగా ఉపయోగించుకొని రైతులు(Farmers) మెరుగైన ఆదాయం పొందవచ్చని తెలిపారు. ప్రభుత్వం అందించే విత్తనాలు, సాంకేతిక సలహాలు, ఇతర వ్యవసాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయాధికారి మోహన్ రెడ్డి రైతులకు శనిగ విత్తన మినీ కిట్లను పంపిణీ చేశారు.మోహన్ రెడ్డి మాట్లాడుతూ... గత సంవత్సరం కృష్ణాజివాడి గ్రామానికి చెందిన రైతు రాజశేఖర్ పండించిన శనగ పంట మంచి దిగుబడిని ఇచ్చిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిజామాబాద్ రీజినల్ మేనేజర్ వినయ్, తాడువాయి వ్యవసాయ శాఖ అధికారి నర్సింలు, ఏఈఓ లు పాల్గొన్నారు.