అమరవీరులు, ఉద్యమ కారుల పోరాటం, త్యాగం స్ఫూర్తి దాయకం

17-09-2026 | 03:57pm

మహనీయుల ఆశయాల సాధనే ప్రభుత్వ లక్ష్యం 

రేవంత్ ప్రభుత్వంలో ప్రజలకు మెరుగైన సేవలు : ఎమ్మెల్యే జీఎస్ఆర్

భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): అమరవీరుల, ఉద్యమకారుల పోరాటం, త్యాగం తెలంగాణా సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకం అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు(MLA Gandra Satyanarayana Rao) అన్నారు. ప్రజాపాలన దినోత్సవం(Telangana prajapalana dinotsavam) సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ... అమరవీరుల, ఉద్యమ కారుల ఆశయాలు, త్యాగాలను స్మరించుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవంగా నిర్వహిస్తోందని తెలిపారు.

రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ, సంక్షేమం, అభివృద్ధిని సమన్వయం చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతుందని అన్నారు. గ్రామీణాభివృద్ధి(Rural development), విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సంక్షేమం వంటి అన్ని రంగాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. తెలంగాణ కోసం పోరాడిన మహనీయుల ఆశయాల సాధనే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు