సీఈసీపై వేటేయాల్సిందే!
- ఈ నెల 30న సీసీఐలో ఇండియా కీలకభేటీ
- హాజరుకానున్న కూటమి పార్టీలు
- ఈ నెల 29న సమావేశం కానున్న కాంగ్రెస్ అగ్రనేతలు
- ఈసీ వివాదం వేళ..ప్రతిపక్షాల్లో పెరిగిన సమన్వయం
- కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌తో మాట్లాడిన టీఎంసీ అధినేత్రి మమత
- ఈసీ వ్యహారం.. సర్‌పై ఉమ్మడి వ్యూహరచనకు సన్నద్ధం
- పశ్చిమబెంగాల్లో ఒక్కతాటిపైకి టీఎంసీ, సీపీఐ(ఎం)
- ఈ పార్లమెంట్ సెసన్స్లోనే సీఈసీపై తొలగింపు తీర్మానం?
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 26: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ)(Chief Election Commissioner) జ్ఞానేశ్‌కుమార్‌పై వేటేయడమే ఉమ్మడి లక్ష్యంగా ఇండియా కూట మి వ్యూహాలను పన్నుతోంది. ఎన్నికల సంఘం (ఈసీఐ) వివాదం, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) అంశాలపై చర్చించేందుకు ప్రతిపక్ష ‘ఇండి యా’ కూటమి పార్టీలు కీలక భేటీని నిర్వహించనున్నాయి. ఈ నెల 30న న్యూఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ)లో ఇండియా కూటమి సమావేశం నిర్వహించనుందని అగ్రవర్గాలు తెలిపాయి.
ఈ సమావేశానికి ప్రతిపక్ష కూటమిలోని అగ్ర నాయకులంద రూ హాజ రవుతారని భావిస్తున్నా రు. అయితే, హాజరయ్యే ఇండియా కూటమి నాయకుల పేర్లు ఇంకా ఖరారు కాలేదు. మమతా బెనర్జీ, కాంగ్రెస్ నాయకత్వం, ఎంఏ బేబీ ఇతర కూటమి పార్టీలతో జరిపిన సంప్రదింపుల అనంతరం ఈ సమావేశం జరుగుతోంది. అయితే ఈ సమావేశానికి ముందే.. అంటే ఈ నెల 29నే కాంగ్రెస్ అగ్రనేతలు సపరేట్గా భేటీ అయ్యి తమ అస్త్రాలను సిద్ధం చేయనున్నారు.
ఈ పార్ల మెంట్ సెసన్స్లో నే సీఈసీపై తొలగింపు తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుక ప్రతిపక్షాలు న్యాయ నిపుణులతో వ్యూహారచన చేస్తున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం పనితీరు, ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియలో అంతర్గత విభేదాలు వచ్చాయనే నివేదికల నేపథ్యంలో ఈ అత్యవసర భేటీని ప్రతిపక్షాల నేతలు ప్రతిపాదించారు. ఈ వివాదంపై ఉమ్మడి కార్యాచ రణ కోసం తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినే త్రి మమతా బెనర్జీ..
కాంగ్రెస్ నేత రా హుల్ గాంధీ, సీపీఐ(ఎం) ప్రధానకార్యదర్శి ఎంఏ బేబీ తదితర ప్రతిపక్ష నేతలతో మాట్లాడారు. పశ్చిమ బెంగాల్లో రాజకీయ ప్రత్య ర్థులైన టీఎంసీ, సీపీఐ(ఎం) ఈ ఈసీ వివాదంపై ఒకే తాటిపైకి వచ్చాయి. ప్రధాన ఎన్ని కల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలని, సర్‌ను తక్షణమే నిలిపివేయాలని సీపీఐ(ఎం), సీపీఐ, సీపీఐ(ఎంఎల్)-, లిబరేషన్ పార్టీలు డిమాండ్ చేయగా, కాంగ్రెస్ కూడా తన విమర్శలను తీవ్రతరం చేసింది.
సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ ఈ పరిణామాలపై సమావేశం కోరుతూ ఇండి యా బ్లాక్‌కు, ఇతర ప్రతిపక్ష నాయకులకు లేఖ రాశారు. అనంతరం ఆయన బెనర్జీతో మాట్లాడగా, ఈ పరిస్థితికి సమన్వయ చర్య అవసరమని ఆమె అంగీకరించారు. ఈ విషయంపై తమ వ్యూహాన్ని చర్చించేందుకు కాం గ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ నెల 29న సమావేశం కానుంది.
మళ్లీ కొత్తగా నోటీసులు..
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతోంది. సీఈసీపై ప్రతిపక్ష పార్టీలు మళ్లీ కొత్తగా తొలగింపు నోటీసులివ్వడానికి సమాయత్తం అవుతున్నాయి. ప్రతిపక్షం చేపట్టను న్న ఇటువంటి ప్రయత్నం ఇది మూడోసారి అవుతుంది. సర్‌కు సంబంధించిన నిర్ణయాలు, ఉత్తర్వులపై ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి పలు సందర్భాల్లో అభ్యంతరాలు వ్యక్తం చేశారని ఓ జాతీయ పత్రికలో వచ్చిన కథనం నేపథ్యంలో ప్రతిపక్షాలు ఈ తాజా ఉద్యమాన్ని ప్రారంభిం చాయి.
ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఆయనపై తొలగింపు తీర్మానం ప్రవేశ పెట్టేందుకు ప్రతిపక్షాలు న్యాయ నిపుణులతో వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ సంయు క్త పోరాట వ్యూహాన్ని ఖరారు చేసేందుకు ఇండియా కూటమి నాయకులు ఈ నెల 30 నాటి సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నారు. ఇంతకుముందు, సర్ ప్రక్రియ, ఎన్నికలకు సంబంధించిన ఇతర అంశాలపై 23 రాజకీయ పార్టీలు, ఒక స్వతంత్ర ఎంపీ కలిసి భారత ప్రధాన న్యాయమూర్తిని ఆశ్రయించారు. దీనిని బట్టి ఈ విషయంలో ప్రతి పక్షాల మధ్య విస్తృత సమన్వయం ఉన్నట్లు స్పష్టమవుతోంది.