వీరనారి చాకలి ఐలమ్మకు ఘన నివాళి
సిరిసిల్లలో ఐలమ్మ జయంతి వేడుకలు.. విగ్రహానికి పూలమాలలు వేసిన మంత్రులు
ధైర్యసాహసాలు, పోరాట స్ఫూర్తిని కొనియాడిన తుమ్మల, శ్రీధర్‌బాబు, అడ్లూరి, ఆది శ్రీనివాస్
రాజన్న సిరిసిల్ల26, సెప్టెంబర్, (విజయక్రాంతి): వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) కేంద్రంలో ఆమె విగ్రహానికి రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, శ్రీధర్‌బాబు, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, రాష్ట్ర ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు చాకలి ఐలమ్మ( Chakali Ilamma) పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు. భూమి, భుక్తి, హక్కుల కోసం ఆమె ప్రదర్శించిన ధైర్యసాహసాలు తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచాయని పేర్కొన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం, ఆత్మగౌరవం కోసం ఐలమ్మ చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ పట్టణ అధ్యక్షులు సూర దేవరాజ్ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని వీరనారి ఐలమ్మకు నివాళులర్పించారు.