రంగారెడ్డిపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం

27-09-2026 | 07:51am

గండీడ్: మహబూబ్ నగర్ జిల్లాగండీడ్ మండల పరిధిలోని రంగారెడ్డిపల్లి(Ranga Reddy Palli) వద్ద జాతీయ రహదారి-167పై అందాజ 4 గంటల సమయంలో బొలెరో వాహనం డివైడర్ను కొట్టడంతో, ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మహబూబ్‌నగర్ మార్కెట్‌కు చెందిన చేపల వ్యాపారి సిద్దు (32) అక్కడికక్కడే మృతి చెందాడు. హన్వాడ మండలం పలెమోని కాలనీకి చెందిన పలెమోని రమేష్, మహమ్మదాబాద్ మండలం చౌదర్‌పల్లి తండాకు చెందిన రాహుల్  తీవ్రంగా గాయపడ్డారు. రమేష్‌ను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.108 సిబ్బంది పైలట్ చాంద్‌పాష, వీఎంటీ జానమ్మ క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

మరిన్ని వార్తలు