జనగామలో జాతర
26-09-2026 | 11:19am
జనగామలో మంత్రి పొంగులేటి అభివృద్ధి జాతర
16 ఆటోలు, జేసీబీ ప్రారంభం
జనగామ, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): జనగామ జిల్లా కేంద్రంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivasa Reddy) పురపాలక కార్యాలయంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. పట్టణ ప్రగతిలో భాగంగా 16 చెత్త సేకరణ ఆటోలను, ఒక జేసీబీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్, వైస్ చైర్ పర్సన్ బుష పార్వతాలు, కౌన్సిలర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.