జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
29-04-2026 12:36 AM
నారాయణపేట. ఏప్రిల్ 28 (విజయక్రాంతి): జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని మంగళ వారం జిల్లా కలెక్టర్ సీ.హెచ్. ప్రియాంక ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్యాలయంలో ఫ్రిజ్ లు, మందుల డబ్బాలు .కార్యాలయ ఆవరణలో ఉండటం చూసిన కలెక్టర్ కార్యాలయంలో ఉన్న ప్రోగ్రామ్ అధికారిని ప్రశ్నించగా ఫ్రిజ్ లు తిరిగి పంపించాల్సి ఉందని, మందులు పిహెచ్ సి లకు సరఫరా చేయాల్సి ఉందని వివరణ ఇచ్చారు. నిబంధనల ప్రకారం మందులను ఎప్పటికప్పుడు సరఫరా చేయాలని కలెక్టర్ ఆదేశించారు.






