ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో గందరగోళం

23-10-2026 | 04:13pm

కాంగ్రెస్ కార్యకర్తల పరస్పర దాడులు

బిజినేపల్లి, అక్టోబర్ 23 : మండలంలోని లట్టుపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల(Indiramma Houses) లబ్ధిదారుల ఎంపికలో కాంగ్రెస్ పార్టీకి చెందిన రెండు వర్గాల మధ్య గందరగోళం నెలకొంది. దీంతో ఇరు వర్గాలు పరస్పరంగా దాడులు చేసుకోవడంతో కమతం శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి గాయ పడ్డాడు. ఇందిరమ్మ ఇండ్ల వెరిఫికేషన్ ఆఫీసర్ మదన్ మోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం లట్టుపల్లిలో రెండవ విడతలో విడుదలైన ఇండ్లను తనిఖీ చేయడానికి గ్రామ పంచాయతీకి వచ్చారు.   

గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన చంద్రగౌడ్, శ్రీనివాస్ రెడ్డి లబ్ధిదారుల ఎంపిక విషయంలో వాగ్వాదం పెట్టుకున్నారు. ఒకరిపై ఒకరు అరుచుకుంటూ దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో శ్రీనివాస్ రెడ్డి చెవి, మూతిపై గాయాలు అయ్యాయి. అక్కడే ఉన్న అధికారులు, స్థానికులు ఇరువురిని విడిపించి అక్కడి నుండి పంపించారు.

మరిన్ని వార్తలు