మట్టిలో మాణిక్యాలకు కొలువులే లక్ష్యం

20-09-2026 | 05:35am

కోదాడలో మెగా జాబ్ మేళా

  1. కోదాడలో త్వరలో టాస్క్ కేంద్రం
  2. మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి, అడ్లూరి

సూర్యాపేట/కోదాడ, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): గ్రామీణ ప్రాంతంలోని మట్టిలో మాణిక్యాలకు ఉద్యోగ అవకాశాలే(Job opportunities) లక్ష్యంగా కోదాడలో మెగా జాబ్ మేళా(Mega Job Mela) ఏర్పాటు చేసినట్లు భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(Uttam Kumar Reddy) అన్నారు. శనివారం కోదాడ సీసీ రెడ్డి విద్యానిలయంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, -మంత్రులు శ్రీధర్‌బాబు(Sridhar Babu), కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరితో కలిసి ప్రారంభించారు. ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేశారు.

ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడు తూ.. తెలంగాణలో రైతులు తమ భూములను అమ్ముకుని తమ పిల్లలను చది వించారని, వారి కష్టానికి తగిన ఫలితం అందించాలని ఉద్దేశంతోనే ఈ జాబ్ మేళాను నిర్వహించినట్లు తెలిపారు. జాబ్ మేళాకు 350 కంపెనీలు, 30 వేలకు పైగా అభ్యర్థులు హాజరయ్యారని చెప్పారు. వీరిలో 5,625 మంది వివిధ కంపెనీలకు ఎంపికై ఉద్యోగాలు సాధించినట్లు వెల్లడించారు. ఈ జాబ్ మేళాకు ప్రముఖ కంపెనీల తో పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని పలు సంస్థలను ఆహ్వానించామని తెలిపారు.

కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల ప్రజలు తన కుటుంబ సభ్యులని మంత్రి ఉత్తమ్ అన్నారు. వారికి ఎంత చేసినా రుణం తీర్చుకోలేనని, తాము పదవుల్లో ఉన్నా లేకపోయినా ఇక్కడి ప్రజల జీవితాల్లో వెలుగు లు నింపేందుకు నిరంతరం కృషి చేస్తానన్నారు. యువతకు నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు మరిన్ని కార్యక్రమాలు చేపడతాన్నారు. 

కోదాడలో త్వరలో టాస్క్ కేంద్రం 

మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడు తూ.. యువతకు నైపుణ్య శిక్షణ అందించడంతో పాటు ఉద్యోగ అవకాశాలను పెంపొ ందించేందుకు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ కేంద్రాన్ని కోదాడలో త్వరలో ఏర్పాటు చేస్తామని సమాచార సాం కేతికత, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తెలిపారు. మారుతున్న ఉద్యోగ రంగానికి అనుగుణంగా యువత తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.

కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల అభివృద్ధి కోసం మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి నిరంతరం శ్రమిస్తున్నారని చెప్పారు. గ్రామీణ ప్రాంత నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలనే సదుద్ధేశంతో మెగా జాబ్ మేళా నిర్వహించిన మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి కృషి చిరస్మరణీయులన్నారు. ప్రస్తుతం ఏఐ హవా నడుస్తుందని సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా యువత మారాలని, అప్పుడే జీవితంలో నిలదొక్కుకోగలుగుతారని స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.

ఏఐలో యువత తమ నైపుణ్యాలను రాష్ట్ర ఎప్పటికప్పుడు మెరుగుపరచుకో వాలన్నారు. ప్రభుత్వం సైతం యువతకు ఉద్యోగాల కల్పనకు తగిన ప్రాధాన్యతని ఇస్తుందన్నారు. ఇప్పటికే 60 వేల ఉద్యోగాలు భర్తీ చేసిందని, మరిన్ని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేస్తున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే ఉత్తమ్‌పద్మావతి మాట్లాడు తూ.. గ్రామీణ యువతకు మంచి భవిష్యత్తు అందించాలనేదే మా ఆకాంక్ష అని అందులో భాగంగానే జాబ్ మేళాను నిర్వహించినట్లు తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల ప్రజలు పడే బాధలు మాకు తెలుసని, వారి కష్టాన్ని గుర్తించే వారి జీవితాలలో వెలుగులు నింపేందుకే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, కలెక్టర్ తేజస్ నందాలాల్ పవార్, ఎస్పీ నరసింహ, కోదాడ మున్సిపల్ చైర్ పర్సన్ ఎర్నేని కుసుమ వెంకటరత్నం బాబు, మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లీశ్వరి, టీ పీపీసీ కార్యదర్శి సి.హెచ్ లక్ష్మీనారాయణ రెడ్డి బీసీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీకాంత్, ఏఐసీసీ సభ్యులు సర్వోత్తమ్ రెడ్డి , సూర్యాపేట డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్న నల్లగొండ డిసిసి అధ్యక్షులు కైలాస్ నేత, టూరిజం మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ఐసీఐసీఐలో ఉద్యోగం సాధించా 

ఎలాగైనా ఉద్యోగం సాధించి కుటుంబానికి ఇబ్బందులు లేకుండా చూడాలని లక్ష్యంతోనే ప్రయత్నాలు చేస్తున్న. దీనిలో భాగంగానే నేను మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాలో పాల్గొని ఐసీఐసీఐలో ఉద్యోగం సాధించా. ఈ విషయం తెలియగానే మా కుటుంబమంతా సంతోషించింది. నాకు ఉద్యోగం రావడానికి కారణమైన మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతిలకు రుణపడి ఉంటా.

- వెన్నెల, మహబూబాబాద్

మాలాంటి వాళ్లకు మంచి అవకాశాలు 

ప్రస్తుతం చాలామంది ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభు త్వ ఉద్యోగం అయితే ఒక్కదానికి వేలమంది పోటీ పడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఉపాధి అవకాశాలు కూడా సక్రమంగా లేక మాలాంటి యువతకు అవస్థలు తప్పడం లేదు. కానీ మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతిరెడ్డిలు జాబ్ మేళా ఏర్పాటు చేయడం మాలాంటి వారికి మంచి అవకాశం. ఈ జాబ్ మేళాలో నేను హెల్త్ కేర్‌లో ఉద్యోగం సాధించా. నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం కల్పించిన వారికి నా కృతజ్ఞతలు. 

      దీప, సూర్యాపేట

మరిన్ని వార్తలు