అంబేద్కర్ పై దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలి
18-09-2026 | 11:25pm
హనుమకొండ, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): అంబేడ్కర్ పై దుష్ప్రచారం ను అడ్డుకుని రాజ్యాంగాన్ని పరిరక్షించాలని కేవీపీఎస్ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద సంపత్(KVPS District General Secretary Manda Sampath) కోరారు. శుక్రవారం అంబేడ్కర్ సెంటర్ లో జిల్లా అధ్యక్షుడు ఓరుగంటి సాంబయ్య అధ్యక్షతన అంబేద్కర్ వాదులు నిరసన చేపట్టారు.
అనంతరం మంద సంపత్ మాట్లాడుతూ రాజ్యాంగం, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని అన్నారు. ప్రస్తుత సమాజంలో రాజ్యాంగ రచయిత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై చెడు ప్రచారం జరుగుతోందని, దీనిని అంబేద్కర్ వాదులు ముక్తకంఠంతో ఖండించాలని అన్నారు. అంబేడ్కర్ విగ్రహాలు, చిత్రాలు, రాజ్యాంగ ప్రతులను అవమానించే ఘటనలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.