రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ లక్ష్యం

25-09-2026 | 07:32pm

ఆలేరును తెలంగాణలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతా

ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య

యాదగిరిగుట్ట, సెప్టెంబర్ 25 (విజయ క్రాంతి):  రైతుల సంక్షేమమే (Farmers' welfare) ప్రభుత్వ ధ్యేయం అని తెలంగాణలోనే ఆలేరును నెంబర్ వన్ గా తీర్చిదిద్దానని    ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య(Government Whip Beerla Ilaiah) అన్నారు. శుక్రవారం యాదగిరిగుట్ట మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం  ఆధ్వర్యంలో నిర్వహించిన అర్ధవార్షిక మహాజనసభ కార్యక్రమంలో  ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిఎసిఎస్  కార్యకలాపాలు, రైతులకు అందుతున్న సేవలు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వ్యవసాయ రంగ అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలపై రైతులకు వివరించారు.  రైతులకు అవసరమైన రుణాలు, వ్యవసాయ సంబంధిత సేవలు, ధాన్యం కొనుగోళ్లు తదితర కార్యక్రమాల్లో పిఎసిఎస్  కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు.

రైతుల సంక్షేమాన్ని దృష్టిలో  రైతు రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాలు  కొనసాగుతున్నాయని అన్నారు. రైతులకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. పిఎసిఎస్ ద్వారా ధాన్యం కొనుగోళ్లను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని అన్నారు.

ఈ ప్రజా ప్రభుత్వంలో మరోసారి  గోదావరి జలాలను వినియోగించి ఆలేరు నియోజకవర్గంలోని అన్ని చెరువులు, వాగులను నింపేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత పాలకులు 10 సంవత్సరాలలో చేయలేని అభివృద్ధిని రెండు సంవత్సరాలలో చేస్తే వాళ్లకు మింగుడు పడడం లేదని అన్నారు.ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు,  వ్యవసాయ శాఖ అధికారులు, సహకార శాఖ సిబ్బంది, రైతులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

* యాదగిరిగుట్ట పిఎసిఎస్ లో 23.5 లక్షల గోల్ మాల్

* రైతుల డబ్బులు తింటే..రైతుల ఉసురు తగులుతుంది

* 23.5 లక్షల గోల్డ్ మాల్ పై దర్యాప్తు చేయాలని ఆదేశం

యాదగిరిగుట్ట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లో 23.5 లక్షల గోల్ మాల్  పై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మండిపడ్డారు. ఈ విషయమై వెంటనే దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఉండగానే నేరుగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కి ఫోన్ చేసి  దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. 23.5 లక్షల రైతుల సొమ్ము మోసం చేస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు. ఈ సంవత్సరం మార్చి నుండి జూన్ వరకు యూరియా బస్తాల ఇతర వ్యవహారాలలో లెక్కలు సరి చూసి ప్రతి ఒక్కరిని లెక్కలో ఉంచాలని అధికారులను ఆదేశించారు.

రైతుల డబ్బులు తింటే రైతుల ఉసురుతగురుతుందని అన్నారు.ఈ విషయంలో ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని అన్నారు. శుక్రవారం యాదగిరిగుట్ట మండల ప్రాథమిక వ్యవసాయ సహకార  సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అర్థవార్షిక మహాసభా కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  కాంగ్రెస్ ప్రజా పాలన రైతు సంక్షేమానికి, రైతుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నదని రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.

ప్రభుత్వం అందిస్తున్న యూరియా తదితర వస్తువులు పక్కదారి పట్టకుండా ప్రభుత్వం యాప్ ను తయారు చేసి ప్రతి ఒక్క రైతుకు తాను పండించే పంటలకు ఎంత యూరియా తదితర వస్తువులు అవసరమో వాటిని కొనుగోలు చేసేందుకు పక్కా ప్రణాళిక బద్ధంగా తీసుకురావడం జరిగిందని దీనికి రైతులు సంతోషిస్తున్నారని అన్నారు. తెలంగాణలోనే ఆలేరును అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు ముందుకు వెళుతున్నామని కొందరు ప్రతిపక్ష నాయకులు కాళ్లలో కట్టెలు పెడుతున్నారని అన్నారు.

పది సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా   అధికారంలో ఉండి ఎమ్మెల్యే కాకముందు వారి ఆస్తులు ఎంత ఎమ్మెల్యే అయ్యాక వారి ఆస్తులు ఎంతనో ఆలేరు ప్రజలు అందరికీ తెలుసునని, తాను ఎమ్మెల్యే కాక ముందుకు వివిధ రకాల వ్యాపారాలు చేసి ఆర్థికంగా బలోపేతం చెందాకే ఎమ్మెల్యేగా నిలబడి గెలిచానని ఇది ప్రజలు అందరికీ తెలుసునని అన్నారు.  రైతులు అధైర్యపడవద్దని ప్రపంచవ్యాప్తంగా ఎల్ నినో ప్రభావంతో ఎండలు విపరీతంగా కొట్టి వర్షాలు లేకపోవడంతో దేశంలో రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమని రైతులు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని అన్నారు.

పిఎసిఎస్ చైర్మన్ చీర శ్రీశైలం మాట్లాడుతూ యాదగిరిగుట్ట పిఎసిఎస్ చైర్మన్ గా నియమితులై మూడు నెలలు అవుతుందని తనకు ఈ విషయంతో ఎలాంటి సంబంధం లేదని, అధికారులు, గత పాలకమండలి సభ్యుల వ్యవహారం మాత్రమేనని తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు.  గత పాలకమండలి సభ్యులు 1200 మంది సభ్యత్వాల రద్దును చేయాలని చూశారని దీనిని పసిగట్టి అధికారుల చుట్టూ తిరిగి అందరి సభ్యత్వాలను తిరిగి రద్దు కాకుండా చేయడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ చీర శ్రీశైలం, డైరెక్టర్లు, అధికారులు రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు