విమోచన దినం కాదు - ఇది వీలీన దినమే

17-09-2026 | 08:56pm

తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పోలం రాజేందర్

మహా ముత్తారం సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం(Telangana Armed Peasant Struggle) సెప్టెంబరు 17 1948 లో భారత యునియన్లో హైదరాబాద్ సంస్థానం కలిసిందని ఇది విలీన దినమే తప్ప విమోచనం కాదని తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పోలం రాజేందర్ అన్నారు. గురువారం మహా ముత్తారం మండల కేంద్రంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట అమరవీరులకు నివాళులర్పించారు. 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం తెలంగాణలో దేశ్ముకులు దేశ్పాండేలా జమీందారులు జాగీర్దారుల అరాచకాలకు పీడనకు వ్యతిరేకంగా 1946 నుండి 1951 వరకు వీర తెలంగాణ పోరాటం కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో జరిగిందని, ఈ పోరాట ఫలితంగా 3000 గ్రామాలలో గ్రామ స్వరాజ్యాలు ఏర్పడ్డాయని 10 లక్షల ఎకరాలు భూమిని కమ్యూనిస్టులు పంచారని  ఈ పోరాటంలో నాలుగు వేల మంది అమరులయ్యారని వారిలో ముఖ్యంగా నైజాం సర్కారుకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో సోయాబుల్లాఖాన్, షేక్ బందగి, ముగ్ధం మయుద్దీన్ ముస్లింలు కూడా ఈ పోరాటంలో తమ ప్రాణాల ఆర్పించారన్నారు.

కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ పోరాట వారసత్వం లేని చరిత్ర తెలియని సన్యాసులు రాజు ముస్లిం కాబట్టి ముస్లిమ్స్ కు వ్యతిరేకంగా జరిగిన పోరాటం అంటే హిందువులు ముస్లింలపై చేసిన పోరాటంగా చిత్రీకరిస్తున్నారని  అని, బిజెపి పార్టీ విభజించు పాలించు అనే పద్ధతిని అవలంబిస్తూ ఈ తెలంగాణలో కులాల మధ్యల మతాల మధ్య వైశాల్యాలు సృష్టించి మత కల్లోలు రేపి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూ అశాంతిని సృష్టిస్తున్నారని బిజెపి పార్టీ అన్నట్టు విమోచన దినమే అయితే భారత సైనికులు నిజాం సర్కార్ని లొంగదీసుకున్న తర్వాత నైజాం రాజుని (మీర్ ఉస్మాన్ అలీ ఖాన్) జైల్లో బంధించి శిక్షించాల్సిన అవసరం ఉండే, కానీ తెలంగాణ రాష్ట్రానికి రాజు ప్రముక్ గా మళ్ళీ అధికారం ఇవ్వడమంటే మరి ఏ రకంగా విమోచనం జరిగిందని వారు ఎద్దేవా చేశారు, కాబట్టి ఇది విమోచన దినం కాదని, వీలీన దినమే అని వారు అన్నారు.

మరిన్ని వార్తలు