క్షణాల్లో కబళించిన మృత్యువు.. ఇద్దరు మృతి

06-10-2026 | 06:45am

మెదక్ జిల్లా నార్సింగి మండలం కాస్టాపూర్ వద్ద జాతీయ రహదారి (National Highway)పై ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. నిజామాబాద్ డిపో (Nizamabad Depot)కు చెందిన ఆర్టీసీ బస్సు స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను దౌల్తాబాద్‌కు చెందిన చంద్రయ్య, పోచవ్వగా గుర్తించారు. ప్రమాద ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

మరిన్ని వార్తలు