డ్రంకన్ డ్రైవ్ కేసులో ఇద్దరికి జైలు శిక్ష

18-09-2026 | 11:34pm

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ట్రాఫిక్ నిబంధనలు(Traffic Rules) ఉల్లంఘించి మద్యం సేవించి వాహనాలు నడిపిన ఇద్దరికి 10 రోజుల జైలు శిక్ష విధిస్తూ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కమ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ అనంతలక్ష్మి శుక్రవారం తీర్పు వెలువరించినట్లు ఆసిఫాబాద్, రెబ్బెన కోర్టు పోలీసులు శ్రీనివాస్, చవాన్ వినోద్, కోర్టు సిబ్బంది అఖిల్ తెలిపారు.

కాగజ్‌నగర్ మండలం ఈస్‌గావ్‌కు చెందిన రఘునాథ్ బైరాగి, బెజ్జూర్ మండలానికి చెందిన కావుడే అంజన్న డ్రంకన్ డ్రైవ్‌లో పట్టుబడ్డారు. వీరిపై ఆసిఫాబాద్, రెబ్బెన పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. విచారణలో నిందితులు మోటార్ వెహికల్ యాక్ట్ నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలడంతో సెక్షన్ 185(ఏ) కింద న్యాయస్థానం 10 రోజుల జైలు శిక్ష విధించింది.

మరిన్ని వార్తలు