రేవంత్ రెడ్డి 3 ఏళ్లు పట్టిందా?.. సీఎంపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

19-09-2026 | 01:28pm

బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు ఎంపీ టికెట్ ఎలా ఇస్తారు?

రేవంత్ రెడ్డివి ఆరోపణలే.. చర్యలు శూన్యం

దోచుకోవడమే కాంగ్రెస్, BRS పని

హైదరాబాద్: పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ హైకోర్టు(Telangana High Court) తీర్పు కాంగ్రెస్, బీఆర్ఎస్ కు చెప్పపెట్టు అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) తెలిపారు. అధికార దాహంతో కాంగ్రెస్, బీఆర్ఎస్(Bharat Rashtra Samithi) ఫిరాయింపులకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. ఓపెన్ ల్యాండ్ ఉంటే ఎలా దోచుకోవాలనే 2 పార్టీలు ఆలోచిస్తున్నాయని ఆరోపించారు. రూ. లక్ష కోట్లు ఇచ్చి మా ఆస్తులు తీసుకోండని ఒకరు అంటున్నారు.

అపార్ట్ మెంట్ కట్టాలంటే లంచం ఇవ్వకపోతే పనులు అవ్వడం లేదని సూచించారు. కేసీఆర్ కుటుంబానికి ఎన్ని ఫామ్ హౌస్ లు ఉన్నాయని ఇప్పుడు అడుగుతున్నారు. రేవంత్ రెడ్డి 3 ఏళ్ల తర్వాత ఎందుకు అడుగుతున్నారు? కేసీఆర్ ఫామ్ హౌస్(KCR's farmhouse)పై సమాచారం కోసం 3 ఏళ్లు పట్టిందా? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి అనేక ఆరోపణలు చేశారు.. చర్యలు మాత్రం శూన్యమని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు(BRS MLA) ఏ విధంగా ఎంపీ టికెట్ ఇస్తారు? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఇలాంటి అ నైతిక పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పాలని కోరారు. 

మరిన్ని వార్తలు