బెల్గాం తండాలో ఘనంగా వనమహోత్సవం
కుభీర్,(విజయక్రాంతి): కుభీర్ మండలంలోని బెల్గాం తండా-1 గ్రామపంచాయతీ పరిధిలో మంగళవారం అటవీ శాఖ ఆధ్వర్యంలో వనమహోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అటవీప్రాంతంలోని ఖాళీ ప్రదేశాల్లో, రోడ్డుకు ఇరువైపులా వివిధ రకాల మొక్కలను నాటారు. ఈ సందర్భంగా అటవీ శాఖ సిబ్బంది, స్థానిక నాయకులు మాట్లాడుతూ.. పర్యావరణ సమతుల్యతను కాపాడటం, పచ్చదనాన్ని పెంపొందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. నాటిన ప్రతి మొక్కను బాధ్యతగా సంరక్షించాలని వారు గ్రామస్తులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు ఎఫ్ ఎస్ ఓ రవి, ఎఫ్ బి ఓ లు రాజేష్, కృష్ణ, యానిమల్ ట్రాకర్ గోరక్నాథ్, గ్రామ ప్రతినిధులు, సర్పంచ్ గోకుల్, పంచాయతీ కార్యదర్శి ముజాహిద్దీన్, గ్రామస్థులు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.






