మున్సిపల్ వైఫ్ చైర్మన్ సేవా కార్యక్రమాలు
నిర్మల్ అక్టోబర్ 23 ( విజయక్రాంతి) : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు(Telangana culture and traditions) ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాల్లో నిర్మల్ మున్సిపల్ చైర్పర్సన్ అప్పాల కావ్య(Nirmal Municipal Chairperson Appala Kavya), వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి సేవా కార్యక్రమాలు(Service Activities) నిర్వహించారు . పండుగ వేడుకల్లో పాల్గొన్న మహిళలకు అల్పాహారం, వాటర్ బాటిళ్లను పంపిణీ చేసి తమ సేవా స్ఫూర్తిని చాటుకున్నారు.
ఈ సందర్భంగా మహిళలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ పండుగ(Bathukamma Festival) తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలవడమే కాకుండా మహిళల ఐక్యతకు, తెలంగాణ ఆత్మగౌరవానికి నిదర్శనమని వారు పేర్కొన్నారు.
పండుగ వేడుకల్లో పాల్గొనే మహిళలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అల్పాహారం, తాగునీటిని పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో బతుకమ్మ పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. బతుకమ్మ పండుగ ప్రతి ఇంటా సుఖసంతోషాలను నింపాలని, కోరుకున్నారు