బీఆర్ఎస్ లీగల్ సెల్ కన్వీనర్‌గా రామకృష్ణ
కోహెడ, అక్టోబర్ 23 (విజయక్రాంతి): బీఆర్ఎస్ పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ(BRS Party Husnabad Constituency) లీగల్ సెల్ కన్వీనర్‌గా కన్నోజు రామకృష్ణ నియమితులయ్యారు. మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ శుక్రవారం ఈ నియామకాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి రామకృష్ణ కృషి చేయాలని, వారికి అవసరమైన న్యాయ సలహాలు అందించాలని కోరారు. కాగా తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్‌కు రామకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి, నాయకులు, కార్యకర్తల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.