తల్లాడ పట్టణంలో భక్తిశ్రద్ధలతో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు

24-09-2026 | 03:08pm

తల్లాడ సత్తుపల్లి. సెప్టెంబర్ 24. ( విజయ క్రాంతి ): విఘ్నేశ్వరుని సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వైరా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కాపా. సుధాకర్ , ఆర్యవైశ్య మండల సంఘం అధ్యక్షుడు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నంబూరు మోహన్ రావు తల్లాడ పట్టణం నందు  వాసవి కన్వెన్షన్ హాల్ నందు ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో  ఘనంగా నిర్వహిస్తున్న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన గణనాథుడికి కాపా. సుధాకర్ , నంబూరి మోహన్ రావు  ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రజలందరికీ విఘ్నాలు తొలగి,ఆయురారోగ్యాలు,సుఖసంతోషాలు,శాంతి సమృద్ధులు కలగాలని  వినాయకుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో వేమిశెట్టి వెంకటేశ్వరరావు, కాపా మహేష్, నంబూరి కనకయ్య, గుండ్ల వెంకటేశ్వర్లు, వేమిశెట్టి నాగన్న, నంబూరి నాగేశ్వరరావు, జవాజి పెద్ద నగేష్, శ్రీను, వేమిశెట్టి శంకర్, తాళ్ల వెంకటేశ్వర్లు  తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

మరిన్ని వార్తలు