సమర్థ వ్యవస్థ అవసరం

06-10-2026 | 05:30am

తెలుగు చిత్ర పరిశ్రమలో(Telugu film industry) ఇటీవల కలకలం రేపిన కృత్రిమ మేధస్సు(Artificial Intelligence) ద్వారా రూపొందించిన నకిలీ వీడియోల(Fake videos) వ్యవహారంపై డైనమిక్ స్టార్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణు మంచు(Vishnu Manchu) తీవ్రంగా స్పందించారు. ఎన్టీఆర్, జాన్వీ కపూర్(NTR, Janhvi Kapoor) నటించిన ‘చుట్టమల్లె’ పాటను('Chuttamalle' Song) కృత్రిమ మేధస్సుతో మార్ఫింగ్ చేసి దుర్వినియోగం చేసిన ఘటనను కేవలం ఒక సంఘటనగా చూడకూడదని, అదుపులేని డిజిటల్ దుర్వినియోగం వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే ప్రమాదాలకు ఇది హెచ్చరిక అని అన్నారు.

డీప్‌ఫేక్‌లకే పరిమితం కాకుండా సినిమాలు, నటీనటులు, దర్శకులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న వ్యవస్థీకృత ప్రతికూల ప్రచారంపైనా విష్ణు మంచు ఆందోళన వ్యక్తం చేశారు. తాజా డీప్‌ఫేక్ సంఘటన.. ఆన్‌లైన్ దుర్వినియోగంపై బాధ్యతను నిర్ధారించేందుకు పరిశ్రమవ్యాప్తంగా సమర్థవంతమైన వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అత్యవసర అవసరాన్ని మరోసారి స్పష్టం చేసిందని విష్ణు మంచు అన్నారు.  

మరిన్ని వార్తలు