ఘనంగా విశ్వకర్మ జయంతి
గుండాల,(విజయక్రాంతి): మండల కేంద్రంలో విశ్వకర్మ జయంతి వేడుకల(Vishwakarma jayanti celebrations)ను గురువారం ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మ సంఘం(Vishwakarma Sangha) పెద్దలు వెలిశాల సత్యనారాయణ పంచ వృత్తుల జెండాను ఎగురవేసిన అనంతరం కులవృత్తిదారులు విశ్వకర్మ భగవాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
విశ్వకర్మ సంఘం మండల అధ్యక్షులు మాజోజు చంద్రాచారి మాట్లాడుతూ... విశ్వకర్మ భగవాన్‌ను సృష్టికి ఆద్యుడైన దేవశిల్పిగా కొలుస్తారని, వడ్రంగి, కమ్మరి, కంచరి, స్వర్ణకారులు, శిల్పులు ఇలా పంచ వృత్తుల ద్వారా సమాజ అభివృద్ధికి విశ్వకర్మ వర్గాలు సేవలు అందిస్తారాని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వకర్మ సంఘం నాయకులు వెలిశాల రవి, కొనపర్తి వెంకటేశ్వర్లు, కందుకూరి హనుమా చారి, వెలిశాల నరేష్, మాజోజు ప్రవీణ్, మాజోజు వెంకటేష్, గుంటుపల్లి కిరణ్, కత్రోజు నరేష్, వెలిశాల కిరణ్, వెలిశాల శివ్ తేజస్, వెలిశాల కార్తికేయ, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.