6 September, 2026 | 3:32 PM

“చలో హైదరాబాద్”ను విజయవంతం చేయాలి

06-09-2026 | 01:23pm

ముకరంపుర, సెప్టెంబరు 6 (విజయక్రాంతి): ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, గెజిటెడ్ అధికారుల దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈ నెల 10న హైదరాబాద్లో నిర్వహించనున్న “చలో హైదరాబాద్” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి, కన్వీనర్ మడిపల్లి కాళీ చరణ్ గౌడ్ పిలుపునిచ్చారు. కరీంనగర్లో రాష్ట్ర జేఏసీ రూపొందించిన “చలో హైదరాబాద్” పోస్టర్ను  విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్యక్రమానికి సన్నాహకంగా 8న కరీంనగర్ టీఎన్జీవోల కమ్యూనిటీ భవనంలో నిర్వహించే ఉమ్మడి జిల్లా స్థాయి సన్నాహక సమావేశానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, గెజిటెడ్ అధికారులు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి సంగేం లక్ష్మణరావు ఎడ్ల అరవింద రెడ్డి మొహద్. ఉస్మాన్ పాషా, పి. నాగమోహన్, కె. కరుణాకర్ రెడ్డి,  ఎ. కరుణాకర్ జైపాల్,  పి. తిరుపతి రావు, డా. వెంకట రాజిరెడ్డి, ఎన్ రామ్మోహన్, పి. రామ్మోహన్,  ఆదర్శన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు