యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్‌ పై విస్తృత అవగాహన

25-09-2026 | 05:48pm

ఘట్ కేసర్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి) : ప్రపంచ ఫార్మసిస్ట్ డే(World Pharmacist Day) –2026, నేషనల్ ఫార్మసీ వీక్ వేడుకలను(National Pharmacy Week Celebration) పురస్కరించుకుని అనురాగ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఫార్మసీ(Anurag University School of Pharmacy) ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ యూనిట్-1 సహకారంతో  యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్(Antimicrobial Resistance) పై విస్తృత అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పిలుపునిచ్చిన స్వస్థ భారత్, కంబాటింగ్ యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు(Students), అధ్యాపకులు ప్రజల్లో యాంటీబయాటిక్స్ సరైన వినియోగంపై చైతన్యం కల్పించారు.

ప్రపంచ ఫార్మసిస్ట్ డే – 2026 మరియు నేషనల్ ఫార్మసీ వీక్ వేడుకలలో భాగంగా ప్రజా అవగాహన ర్యాలీ, సైంటిఫిక్ కార్టూన్ కాంపిటీషన్, సైంటిఫిక్ పోస్టర్ ప్రజెంటేషన్, ఎడ్యుకేషనల్ లీఫ్‌లెట్ డిజైనింగ్, ఫార్మా క్విజ్, నుక్కడ్ నాటక్, వీధి నాటకం, డిజిటల్ రీల్ మేకింగ్, కార్యక్రమాలను నిర్వహించారు. 

చౌదరిగూడ నుండి ప్రతాపసింగారం ఎక్స్ రోడ్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని అనురాగ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఫార్మసీ డీన్ డాక్టర్ బి. వసుధ భక్షి, నల్లా నరసింహారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ – స్కూల్ ఆఫ్ ఫార్మసీ డీన్   డాక్టర్ చిన్నాల కృష్ణ మోహన్ తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో అనురాగ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఫార్మసీ విద్యార్థులతో పాటు ఎన్ ఎన్ ఆర్ జి ఫార్మసీ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

ర్యాలీ అంతటా విద్యార్థులు ప్లకార్డులను ప్రదర్శిస్తూ, యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ పై అవగాహన కల్పించే నినాదాలు చేశారు.

మరిన్ని వార్తలు