కార్మికులకు హెల్త్ క్యాంప్.. రక్షణ పరికరాల పంపిణీ
కల్వకుర్తి,సెప్టెంబర్ 30: ప్రజల ఆరోగ్యం కోసం నిరంతరం పనిచేస్తున్న కార్మికులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రాధాన్యతనిస్తూ తరచుగా వైద్య పరీక్షలు (Medical Tests) చేయించుకోవాలని కల్వకుర్తి మున్సిపల్ చైర్పర్సన్ బృంగి రత్నమాల అన్నారు.మున్సిపల్ కార్యాలయంలో కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్‌ను (Health Camp) వైస్ చైర్మన్ షానవాజ్ ఖాన్, మున్సిపల్ కమిషనర్ మహమూద్ షేక్‌తో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కార్మికులు విధుల్లో భాగంగా ప్రజల ఆరోగ్యం, పారిశుధ్య పరిరక్షణ కోసం నిరంతరం సేవలందిస్తున్నారని తెలిపారు.
క్యాంప్‌లో కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు సేఫ్టీ జాకెట్లు, గ్లౌజ్‌లు (Safety Gear) పంపిణీ చేశారు. విధుల సమయంలో కార్మికులు తప్పనిసరిగా రక్షణ పరికరాలను (Protective Equipment) వినియోగించాలని సూచించారు.కార్మికుల ఆరోగ్య పరిరక్షణ కోసం అవసరమైన వైద్య పరీక్షలు, భద్రతా చర్యలను నిరంతరం కొనసాగిస్తామని చైర్పర్సన్ తెలిపారు.