20 August, 2026 | 8:05 PM

ప్రతికూల ఆలోచనలకు యోగ దూరంగా ఉంచుతుంది

20-08-2026 07:33 PM

బోథ్,(విజయక్రాంతి): ప్రతికూల ఆలోచనలను యోగ దూరంగా ఉంచుతుందని యోగా శిక్షకురాలు మునిగల యోగిత పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాలలో విద్యార్థులకు యోగశిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులకు పలు రకాల ఆసనాలు వేసి చూపించారు. విద్యార్థులకు సైతం యోగ ఆసనాలను నేర్పడం జరిగింది. ప్రతిరోజు యోగ చేయడం వల్ల నూతన ఉత్తేజం కలుగుతుందని పేర్కొన్నారు.

ప్రస్తుత వాతావరణ మార్పుల నేపథ్యంలో సీజనల్ వ్యాధులు రాకుండా అరికట్టవచ్చు అన్నారు. శారీరకంగా మానసికంగా యోగ ఉపకరిస్తుందని పేర్కొన్నారు యోగా ద్వారా ఏకాగ్రత పెరుగుతుందని విద్యార్థులకు తెలిపారు. విద్యార్థులు సెల్ఫోన్లకు దూరంగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో కేజీబీ వి పాఠశాల ప్రిన్సిపాల్ రాథోడ్ దళిత పిఈటి విద్యాపకులు పాల్గొన్నారు.