లిక్కర్ కిక్కు @రూ.63.99 కోట్లు!

23-10-2026 | 05:15am

దసరా ఒక్క రోజే రూ.40 కోట్లు

ఉమ్మడి కరీంనగర్‌లో పెరిగిన మద్యం విక్రయాలు

కరీంనగర్, అక్టోబర్ 22 (విజయక్రాంతి): దసరా పండుగ వేళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మద్యం విక్రయాలు(Liquor Sales) రికార్డు స్థాయిలో జరిగాయి.  పండుగ సీజన్లో ఇక్కడి మందుబాబులు వందల కోట్ల రూపాయల మద్యాన్ని తాగేస్తుంటారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా దసరా పండుగ మద్యం అమ్మకాలు రూ:63. 99 కోట్ల మేర జరిగాయి.

దసరా పండుగకు ముందు 3-4 రోజుల వ్యవధిలోనే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న దాదాపు 287 వైన్ షాపులు,76 బార్ అండ్ రెస్టారెంటుల్లో రూ. 63.99 కోట్ల  వరకు మద్యం అమ్మకాలు జరగగా ఒక్కరోజే రికార్డు: కేవలం దసరా  రోజునే సుమారు రూ. 40 కోట్లకు పైగా లిక్కర్, బీర్ల విక్రయాలు జరిగి ఎక్సైజ్ శాఖకు భారీగా ఆదాయం సమకూరింది కరీంనగర్లోని ప్రధాన లిక్కర్ డిపో నుండి జగిత్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల  కరీంనగర్ జిల్లాల పరిధిలోని వైన్షాపులు, వాక్-ఇన్ స్టోర్లకు లారీలకొద్ది స్టాక్ లిఫ్ట్ చేశారు.

తెలంగాణ లిక్కర్స్, ఆర్‌ఆర్‌ఆర్ వైన్స్) విస్కీ, బ్రాందీ, రమ్ మరియు బీర్ కేసులు భారీగా సరఫరా అయ్యాయి. అమ్మకాల్లో  ఉమ్మడి కరీంనగర్ జిల్లా తన ప్రత్యేకమైన జోష్ను చాటుకుంది.  కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా రూ: 21. 70, జగిత్యాల జిల్లాలో రూ: 15.25, సిరిసిల్ల జిల్లాలో రూ;10.91, పెద్దపల్లి జిల్లాలో రూ: 16. 13 కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు  జరిగాయి. గత ఏడాదితో పోల్చుకుంటే  7 కోట్ల రూపాయలు అధికంగా జరిగాయి.బెల్టుషాపుల ద్వారా మద్యం ఏరులైపారగా, భారీ ఆదాయమే లక్ష్యంగా ఎక్సైజ్ అధికారులు మద్యం వ్యాపారులకు టార్గెట్లు పెట్టి మరీ విక్రయాలు జరిగేలా చూఫ్సడంతో దసరా పండుగ సందర్భంగా నాలుగు రోజుల్లోనే 63. 99 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి.

మరిన్ని వార్తలు