5 September, 2026 | 8:17 PM

దొంగల అరెస్టు.. సొత్తు స్వాధీనం

05-09-2026 | 07:00pm

నిర్మల్ సెప్టెంబర్ 5 ( విజయ క్రాంతి):  నిర్మల్(Nirmal) జిల్లాలో దేవాలయాలు ఇతర ప్రదేశాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా సభ్యులను నిర్మల్ టైగర్ ఫోర్స్ పోలీస్ బృందం పట్టుకొని అరెస్టు చేసినట్టు జిల్లా ఎస్పీ జానకి(SP Janaki) షర్మిల తెలిపారు. శనివారం వివరాలు వెల్లడించారు. నిర్మల్ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో దేవాలయాలు తాళం వేసిన ఇండ్ల దొంగతనాలపై టైగర్ టాస్క్ ఫోర్స్(Tiger Task Force) బృందం మెగా పెట్టి దొంగలను పట్టుకుని అరెస్టు చేయడం జరిగిందన్నారు.

రాజశేఖర్, రాజేశ్వర్ శ్రీకాంత్, సాయి కిరణ్ ఉన్నట్టు తెలిపారు. వారి వద్ద నుంచి వాహనం గ్యాస్ కట్టర్ వెండి బంగారం నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. వీరు 25 కేసులు నిందితులుగా ఉన్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి శ్రీనివాస్ సిఐలు కృష్ణ సమ్మయ్య ఎస్సై లింబాద్రి గణేష్ శ్రీకాంత్ అశోక్ గఫర్ పోలీస్ సిబ్బంది ఉన్నారు

మరిన్ని వార్తలు