సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ

19-09-2026 | 07:32pm

నిర్మల్,(విజయక్రాంతి): ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా మంజూరైన చెక్కులను నిర్మల్ నియోజకవర్గ(Nirmal Constituency) కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కూచాడి శ్రీహరిరావు శనివారం లబ్ధిదారులకు అందజేశారు. నిర్మల్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 40 మంది లబ్ధిదారుల(beneficiaries)కు మొత్తం రూ.13 లక్షల 39 వేల విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఆయన చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఆపదలో ఉన్న కుటుంబాలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి కింద ఈ చెక్కులను అందించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

మరిన్ని వార్తలు