జిల్లా స్థాయి జానపద నృత్య పోటీలు
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో SCERT Population Education Cell వారి సూచనల మేరకు 2026 జిల్లా స్థాయి జానపద నృత్య పోటీలు(Folk Dance Competitions) ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉత్సాహం పాల్గొన్నారు విద్యార్థులు తమ ప్రాంతీయ సంస్కృతి, సంప్రదాయాలు, జానపద కళలను ప్రతిబింబించే విధంగా అద్భుతమైన నృత్య ప్రదర్శనలు ఇచ్చారు విజేతలైన విద్యార్థులకు జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న బహుమతులు ప్రశంసా పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో AMO నర్సయ్య, న్యాయ నిర్నేతలుగా, పరమేశ్వర్, స్వప్న పాల్గొని విద్యార్థులను ప్రోత్సాహించారు