వినాయక్ నగర్ ఫేజ్–2లో తాగునీటి సమస్య
హైదరాబాద్: వినాయక్ నగర్ ఫేజ్–2(Vinayak Nagar Phase-2)లో నాలుగు అంగుళాల ప్రధాన పైప్‌లైన్‌లో నీటి సరఫరా పీడనం (Water supply pressure) తక్కువగా ఉండటంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పైప్‌లైన్ చివరి ప్రాంతంలో ఉన్న ఇళ్లకు నీరు సరిగా చేరడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రధాన పైప్‌లైన్‌కు అనుమతులు లేకుండా అర అంగుళం పరిమాణంలో రెండు చొప్పున అదనపు కనెక్షన్లు ఏర్పాటు చేసుకోవడంతో నీటి పీడనం తగ్గి చివరి ఇళ్లకు నీరు అందడం లేదని వారు ఆరోపిస్తున్నారు. అధికారులు వెంటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి అక్రమ కనెక్షన్లను గుర్తించి, తొలగించడంతో పాటు ప్రతి ఇంటికీ సమానంగా నీరు అందేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.