సంవిధాన్ రక్షా మార్చ్‌కు కాంగ్రెస్ శ్రేణులు తరలిరావాలి
వెంకటాపూర్, నవంబర్ 25 (విజయక్రాంతి): భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏఐసీసీ (AICC) పిలుపు మేరకు గురువారం హైదరాబాద్‌లో నిర్వహించనున్న సంవిధాన్ రక్షా మార్చ్‌కు మండలం నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలిరావాలని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బండి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
ఈ నెల 26న ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వరకు టీపీసీసీ (TPCC) ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ ఇన్చార్జి బి.ఎం. సందీప్ కుమార్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క ముఖ్య అతిథులుగా (Chief Guests) హాజరుకానున్నారని పేర్కొన్నారు.
ములుగులోని ఘట్టమ్మ తల్లి ఆలయం నుంచి కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీగా బయలుదేరనున్నట్లు వెల్లడించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బండి శ్రీనివాస్ కోరారు.