యువతే దేశానికి అతిపెద్ద బలం: వెంకటేష్

25-11-2026 | 12:02pm

డ్రగ్స్‌కు దూరంగా ఉండండి.. జీవితాలను నాశనం చేసుకోవద్దు

హైదరాబాద్: దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని, వారే భారతదేశానికి అతిపెద్ద బలమని సినీ నటుడు విక్టరీ వెంకటేష్(Actor Victory Venkatesh) అన్నారు. యువతకు విద్య, నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు వారి భవిష్యత్తును కాపాడుకోవడం కూడా సమాజ బాధ్యతేనని పేర్కొన్నారు.

డ్రగ్స్ వ్యసనాల నుంచి పిల్లలను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. 2029 నాటికి డ్రగ్స్ రహిత భారత్‌(Drug Free India)ను నిర్మించాలనే లక్ష్య సాధనకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల విద్య, ఆరోగ్యం, భవిష్యత్తు తీవ్రంగా దెబ్బతింటాయని హెచ్చరించారు.

జీవితం ఎంతో విలువైనదని, క్షణికమైన వ్యసనాలకు బానిసై భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని యువతకు సూచించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవితాన్ని ఎంచుకోవాలని పిలుపునిచ్చారు. 'నో టు డ్రగ్స్.. ఎస్ టు లైఫ్' అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని వెంకటేష్ సందేశమిచ్చారు.

మరిన్ని వార్తలు