గజ్వేల్ అభివృద్ధికి నిధులివ్వండి!

22-10-2026 | 07:11pm

- నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయండి

- మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామికి కాంగ్రెస్ నేతల విజ్ఞప్తి

గజ్వేల్: గజ్వేల్ నియోజకవర్గ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయడంతోపాటు, పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని కోరుతూ కాంగ్రెస్ నేతలు రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామిలకు విజ్ఞప్తి చేశారు. గురువారం మాజీ ఎమ్మెల్యే, గజ్వేల్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి తూముకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో మంత్రులను కలిసి పలు సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు.

గత మూడేళ్లుగా అసంపూర్తిగా ఉన్న రింగ్‌ రోడ్డు, రోడ్ల విస్తరణ పనులు పూర్తి చేయాలని, ప్రభుత్వ కార్యాలయాల మరమ్మతులు, నూతన భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో గజ్వేల్‌కు ప్రాధాన్యం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఖాళీగా ఉన్న నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయడంతోపాటు, రాష్ట్రస్థాయి పదవుల్లో గజ్వేల్ కాంగ్రెస్ నేతలకు అవకాశం కల్పించాలని కోరారు.

దీనిపై మంత్రులు సానుకూలంగా స్పందించినట్లు తూముకుంట నర్సారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసీసీ నాయకులు నాయిని యాదగిరి, వంటిమామిడి మార్కెట్ కమిటీ చైర్మన్ విజయమోహన్, వైస్ చైర్మన్ ప్రభాకర్ గుప్తా, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్, లీగల్ సెల్ నేత సాజిద్ బేగ్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు అశోక్ రెడ్డి, కీసర వెంకటేష్, సమీర్‌తో పాటు వివిధ మండలాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు