ఉద్యోగం ఇప్పి స్తానని మోసం
బోథ్,(విజయక్రాంతి): సోనాల మండల కేంద్రానికి చెందిన బోయినపల్లి నరసయ్య అనే వ్యక్తి నాలుగు సంవత్సరాల క్రితం ఆదిలాబాద్ లోని శాంతినగర్‌కు చెందిన పండుగల రాజేందర్ అనే వ్యక్తి వద్ద ఆరు లక్షల రూపాయలు చెల్లించాడు. జూనియర్ లైన్మెన్ ఉద్యోగం(Junior lineman job) కోసం పది లక్షలు అవసరమవుతాయని చెప్పడంతో 3 లక్షల85 వేల రూపాయలు ఫోన్‌పే ద్వారా చెల్లించడం జరిగిందన్నారు.
అంతేగాక మరో విడతలు రెండు లక్షల 15 వేల రూపాయలు చెల్లించాలని ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్(Adilabad One Town Police Station) ఎస్హెచ్ఓ బి.సునీల్ కుమార్ తెలిపారు ఉద్యోగం ఇప్పించకపోగా పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించడం జరిగిందని అయితే తీసుకునేటప్పుడు తిరిగి చెల్లిస్తానని రాజేందర్ అంగీకరించడం జరిగింది అన్నారు.
అయితే ఇప్పటివరకు రూ.1.27 వేలు మాత్రమే చెల్లించగా మరో నాలుగు లక్షల డెబ్బై మూడు వేల రూపాయలు చెల్లించక పోవడంతో డబ్బులు చెల్లించిన వ్యక్తి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు చేపడుతున్న ఎస్ హెచ్ ఓ. తెలిపారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు అడిగే వ్యక్తులను నన్ను మోసపోవద్దని, ఎవరైనా డబ్బులు తీసుకుని మోసం చేస్తే పోలీసుల దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు.