సబ్సిడీపై కందులు శనిగలు పంపిణీ చేసిన ఏవో సాయికిరణ్
22-10-2026 | 07:04pm
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): ఎల్నినో ప్రభావం(El Nino impact) కారణంగా వర్షాలు తక్కువగా కురవడంతో పాటు భూగర్భ జలాలు అడుగున చేరడంతో రైతులు యాసంగిలో వరి సాగు(Paddy cultivation) చేయవద్దని ప్రభుత్వం సూచించింది.ఆరుతాడి పంటలు అయినటువంటి శనిగలు, కంది, నువ్వులు, పెసలరు, మినుములు, కుసుమలు వేయాలని సూచించడం అయింది. అందులో భాగంగా నాగిరెడ్డిపేట్ మండలంలో రైతుల(Farmers)కు సబ్సిడీపై కందులు,శనిగలు పంపిణీ చేయడం జరిగిందని ఏవో సాయికిరణ్ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ డైరెక్టర్లు లక్ష్మణ్ ఠాగూర్, దివిటి కిష్టయ్య,రైతులు పాల్గొన్నారు.