ఔట్సోర్సింగ్ ఉద్యోగులపై ప్రభుత్వ చిన్నచూపు

27-10-2026 | 05:08pm

నిర్మల్, అక్టోబర్ 27 (విజయక్రాంతి): జాతీయ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూడడం తగదని రాష్ట్ర మాజీ మంత్రి బోడ జనార్ధన్(Former Minister Boda Janardhan) అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మెకు మద్దతు పలికారు. క్రమబద్ధీకరించే వరకు 100 శాతం గ్రాస్‌ శాలరీ చెల్లించాలని కోరారు. ఉద్యోగ భద్రతతో పాటు ఆరోగ్య భద్రత కల్పించాలని, 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి రూప్ సింగ్ జేఏసీ నేతలు ఉన్నారు.

మరిన్ని వార్తలు