పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

05-10-2026 | 10:29pm

నిర్మల్ అక్టోబర్ 5 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న పాత్రికేయులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని నిర్మల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో పాత్రికేయులు రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy), జూపల్లి కృష్ణారావు వినతిపత్రం అందించారు. నిర్మల్ జిల్లాలో ఏళ్ల తరబడిగా తాము పని చేస్తున్నామని ఇళ్లస్థలాలు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని వారు మంత్రికి విన్నవించారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యని ఈ సమస్యకు త్వరలో తమ ప్రభుత్వం పరిష్కార మార్గం చూపుతోందని మంత్రులు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శ్రీధర్ ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ పాత్రికేయులు ఉన్నారు.

మరిన్ని వార్తలు