మహా అన్నదానంలో పాల్గొన్న మున్సిపల్ వైస్ చైర్మన్

17-09-2026 | 04:46pm

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని మంచిర్యాల చౌరస్తాలో శివమిత్ర గణేష్ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన మహా అన్నదాన కార్యక్రమంలో నిర్మల్ మున్సిపల్(Nirmal Municipal) వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి  పాల్గొన్నారు. గణేష్ మండపాల నిర్వహకులు గణేష్ నవరాత్రి ఉత్సవాల(Ganesh Navratri celebrations)ను ప్రశాంతంగా భక్తి వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్న శివమిత్ర గణేష్ మండలి సభ్యులను అభినందించారు.

మరిన్ని వార్తలు