ఆరోగ్య ఉప కేంద్రం కొరకు స్థల పరిశీలన

17-09-2026 | 05:14pm

సిర్గాపూర్,(వినాయక్రాంతి): సంగారెడ్డి జిల్లా(Sangareddy District) సిర్గాపూర్ మండల పరిధిలోని కడ్పల్ గ్రామంలో ఆరోగ్య ఉప కేంద్రం(health sub-centre) ఏర్పాటు చేసేందుకు డాక్టర్ నిఖిత, సర్పంచ్ విమల విట్టల్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి రవీందర్ రెడ్డితో కలిసి గురువారం స్థల పరిశీలన చేపట్టారు. గ్రామంలో స్థలం పరిశీలించి, అవసరమైన సౌకర్యాలు, అందుబాటులో ఉన్న మౌలిక వసతులపై వివరాలు సేకరించారు. త్వరలో స్థలాన్ని ఖరారు చేసి, ఆరోగ్య ఉప కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.

మరిన్ని వార్తలు