మోర పద్మ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి

17-09-2026 | 05:20pm

తిరుమలాయపాలెం,(విజయ క్రాంతి): తిరుమలాయపాలెం మండల పరిధిలోని మేడిపల్లి గ్రామం(medipalli village)లో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) ఇటీవల అకస్మాత్తుగా మృతి చెందిన మోర పద్మ కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి మనోధైర్యం కల్పించారు. మోర పద్మ మృతి కుటుంబానికి తీరని లోటని అన్నారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని సూచించారు. భవిష్యత్తులో కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులతో పాటు విద్యుత్ శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు